telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

హైదరాబాద్ : … ఎల్బీస్టేడియంలో .. అధికారికంగా క్రిస్మస్‌ విందు..

telangana govt christmas celebrations in

నేడు తెలంగాణ ప్రభుత్వం ఎల్బీస్టేడియంలో క్రైస్తవులకు క్రిస్మస్‌ విందును నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు.

ఆంక్షలు :
* ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు అనుమతించరు. నాంపల్లి, చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.
* అబిడ్స్‌ నుంచి బీజేఆర్‌ వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద మళ్లిస్తారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వద్ద లిబర్టీవైపు మళ్లిస్తారు.
* కారు పార్కింగ్‌-గోల్డ్‌ కార్డు పాసుతో వచ్చే వారు ఏ గేట్‌ దగ్గర దిగి, వాహనాలను అలియా మోడల్‌ స్కూల్‌, ఎస్‌సీఈఆర్‌టీ, అలియా కాలేజీలో పార్క్‌ చేయాలి.
* గ్రీన్‌ కార్డు పాసు ఉన్న వారు డీ గేట్‌ వద్ద దిగాలి. వాహనాలను అలియా కాలేజీ, మహబూబ్‌ కాలేజీ, అలియా మోడల్‌ స్కూల్‌ వద్ద పార్క్‌ చేయాలి.
* బ్లూ కార్డు పాసు ఉన్న జీ గేట్‌ దగ్గర దిగాలి.వాహనాలను పబ్లిక్‌ గార్డెన్‌లో పార్క్‌ చేయాలి.
* పింక్‌ కార్డు పాసులు ఉన్న ఎఫ్‌, ఎఫ్‌-1 గేటు దగ్గర దిగాలి.వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్‌లో పార్క్‌ చేయాలి. ఈ కార్యక్రమానికి వచ్చే వారు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని అదనపు పోలీసు కమిషనర్‌ అని ల్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ అంక్షలు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 వరకు కొనసాగుతాయని వివరించారు.

Related posts