telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

ఫొని అతి తీవ్ర తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికం : ఆర్టీజీఎస్‌

red alert in srikakulam on poni cyclone

ఉత్తరాంధ్రపై ఫొని అతి తీవ్ర తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని ఆర్టీజీఎస్‌ వివరించింది. శ్రీకాకుళం తీర ప్రాంతానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 3న మధ్యాహ్నానికి ఒడిశా తీరంలోని పూరి, పారాదీప్‌ మధ్య తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి నుంచి 4వ తేదీ తెల్లవారుజాము దాకా తుపాను తీరం దాటే ప్రాంతంలో గంటకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.

శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో దాదాపు 40 నుంచి 112కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో 120 మి.మీ నుంచి 180 మి.మీ వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

Related posts