ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలపై విమర్శలు చేశారు. ఇవాళ ఆయన జీహెచ్‌ఎంసీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యోగి యూపీని రాముడి పేరుతో రావణ కాష్టంగా మార్చారని… రాముడు ప్రతీ హిందువుకి ఆదర్శ పురుషుడని పేర్కొన్నారు. యోగి.. రాముడి పేరు ముందు పెట్టి.. నాధూరం గాడ్సే ని పూజిస్తున్నారని మండిపడ్డారు. మా అభ్యంతరం రాముణ్ణి పూజించినందుకు కాదని… గాడ్సే ని పూజించే మీ పట్ల మా అభ్యంతరమని ఫైర్ అయ్యారు. బక్క కేసీఆర్.. ఇవాళ బకాసురుడు అయ్యాడని.. అరేండ్లు బీజేపీ తో కేసీఆర్ దోస్తీ చేశాడని ఆగ్రహించారు మధుయాష్కీ. ఇప్పుడు బీజేపీ గోతిలో సీఎం కేసీఆర్ పడుతున్నాడని.. పొట్టోడి తల పొడుగొడు కొడితే… పొడుగొడి తల పోచమ్మ కొట్టిందన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ని కొట్టాలని చూసిన కేసీఆర్ ని ఇప్పుడు బీజేపీ కొడుతుందని పేర్కొన్నారు. బక్కోడివి… ఇంతగా ఎలా బలిశావో తేలాలన్నారు.
previous post