telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ధనం అనేది…శ్రమదోపిడీకి.. మహాద్వారం! 

ధనం అనేది… 

శ్రమదోపిడీకి.. మహాద్వారం! 

కష్టపడని వారు 

కష్టపడలేని వారు 

కార్మికుల శ్రమను కొల్ల గొట్టి 

కరెన్సీగా మార్చి 

కష్ట పడకుండా.. కాలక్షేపం చేసే 

దోపిడీ సాధనం.. ధనం!

 

కరెన్సీ కాలుపెట్టక ముందు 

శ్రమను పంచుకునేవారు 

ఒకరి శ్రమ ఫలితాన్ని 

వేరొకరి శ్రమ ఫలితంతో 

ఇచ్చిపుచ్చుకునేవారు 

అందరూ కష్ట పడేవారు 

అందరూ ఆనందంగా ఉండేవారు! 

 

శ్రమ ఫలితం పంచుకోవటమే 

జీవన విధానం కావడంవల్ల

అందరూ కష్టపడేవారు 

మరి నేడో….

కొందరి శ్రమను 

మరికొందరు దోపిడీ చేస్తూ 

కరెన్సీగా మారుస్తూ 

కోట్లకు పడగలెత్తుతూ 

కొలువులు కొల్లగొడుతూ 

కాసులు మూటలుకడుతూ  

కష్టజీవులపై పెత్తనంచేస్తూ 

దోపిడీ వ్యవస్థను ….

ద్విగుణీకృతం చేస్తున్నారు!

Related posts