telugu navyamedia
Uncategorized ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

శృంగార ప్రియులకు గుడ్ న్యూస్ : ఇవి తింటే ఇక పండగే !

మన దేశంలో ఎక్కువగా పెరిగే ‘అశ్వగంధ’ను ‘కింగ్ ఆఫ్ ఆయుర్వేద’ అని కూడా పిలుస్తారు. దీన్ని ‘ఇండియన్ జిన్సెంగ్’ అని కూడా అంటారు. దీనికి ‘గుర్రపు వాసన’ అనే పేరు సైతం ఉంది. ‘అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి’ మొదలైన ఎన్నో రకాల ఆయుర్వేద మందుల తయారీలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అశ్వగంధను హెర్బల్ ఔషధంగా వాడుతున్నారు. కేవలం మన దగ్గరే కాకుండా అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ‘యాంటీ ఇన్‌ఫ్లామేటరీ మందుగా’ దీన్ని ఉపయోగిస్తున్నారు.

దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.

అనేక ఔషధ గుణాలకు నిలయంగా ఉన్న అశ్వగంధ మొక్క వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయి. జ్ఞాపకశక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగా అశ్వగంధ పేరుగాంచింది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే గుణం దీనికి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. చిటికెడు పల్లేరు కాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణంతో కలిపి ఈ పొడిని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకుని నిద్రించే సమయంలో తాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఈ విధంగా కనీసం 10 నుంచి 15 రోజుల పాటు వాడితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.

అశ్వగంధ మొక్కకు చెందిన ఎండిన వేర్లను కొద్దిగా నీటిలో వేసి 45 నిమిషాల పాటు వేడి చేసి బాగా కలిపితే అశ్వగంధ టీ తయారవుతుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో నాడీ సంబంధిత ప్రసరణ మెరుగు పడుతుంది.ప్రతి రోజూ ఉదయాన స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఒక కప్పు అశ్వగంధ టీని అందిస్తే వారి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే గుణాలు అశ్వగంధ టీకి ఉన్నాయి. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. మత్తును కలిగించే ఔషధంగా అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. శరీరానికి పుష్టిని, బలాన్ని ఇవ్వడంతోపాటు పొట్ట సంబంధిత వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. నీరసాన్ని, నిస్సత్తువను దరిచేరనీయదు. కండరాల వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది.

స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. పళ్లని గట్టి పరచడంతోపాటు దంత క్షయం రాకుండా , కురుపులకి, కడుపులో ఏర్పడే అల్సర్స్‌కి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోపాటు లివర్ సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. ఈ అశ్వగంధిలో విథనోలైడ్స్‌, ఆల్కలైడ్స్‌, మళ్ళీ వీటిలో విథ నోన్‌, విథాఫెరిన్‌ ఎ, విథనొలైడ్‌ 1, విథసోమిడినెస్‌, విథనోలై డ్‌ సి, కస్కో హైగ్రైన్‌, అన హైగ్రైన్‌, ట్రొఫైన్‌, సూడో ట్రోఫైన్‌, అన ఫెరైన్‌, ఇసో పెల్లా, టిరైన్‌, 3-ట్రిపిల్‌టీ గ్లోరైట్‌నే రసాయనాలు ఉంటాయి. ఇవికాక, ప్రొలైన్‌, వలైన్‌, ట్రయోసిన్‌, అలనైన్‌, గ్లైసిన్‌, హైడ్రాక్సిప్రొలైన్‌, అస్పార్టిక యాసిడ్‌, గ్లుటా మిక యాసిడ్‌, సిస్టయిన్‌, గ్ల్రైకోసైడ్‌, గ్లూకోస్‌, క్లోరోజనిక యాసిడ్‌, టానిన్‌, ప్లానోనాయిడ్స్‌, విథనోలైడ్స్‌, అల్కలాయిడ్‌ అనే ఇతర మూల క రసాయనాలు కూడా ఉంటాయి. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలుకురుపులకి, కడుపులో అల్సర్స్‌ని రాకుండా అరికడుతుంది, తగ్గిస్తుంది. వెూకాలు నొపðలకి ఇది మంచి ఔషధం. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. లివర్‌ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది. కేన్సర్‌, అల్సర్‌ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది.

 

 

Related posts