telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత మాజీ ఆటగాళ్లు…

2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు తాజాగా బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ ప్రకటించింది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్ల చొప్పున వేతనం అందనుంది. అయితే ఈ ఏ+ గ్రేడ్ జాబితాలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటివ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను మూడు ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శన కబర్చడంతో పాటు ఐసీసీ ర్యాంకుల్లో మంచి స్థానంలో ఉన్నాడని, అలాంటి ప్లేయర్‌కు ప్రమోషన్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు.రవీంద్ర జడేజాకు ఏ కేటగిరి జాబితాలో ఉండగా అతనికి రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అయితే రవీంద్ర జడేజాకు ఏ+ కేటగిరి ఇచ్చేందుకు అన్ని అర్హతలున్నాయని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.‘ఏ+ కేటగిరి కాంట్రాక్ట్‌కు జడేజా సరైనవాడు అని ఎమ్మెస్కే తెలిపాడు.

Related posts