telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జన్మంతా కళ్ళ లో పెట్టుకొని చూసుకుంటానే…..

గల్ గల్ మువ్వులు పెట్టి
చెంగు చెంగున నీవు పరుగెడుతుంటే
లవ్ లవ్ అని నేనంటుంటే
నహీ నహీ అంటావేంటే్..?
కోహినూర్ వజ్రమే నేను
కాదనకే నన్ను….!
పారిజాతమే నీవు
జారిపోనీయనే నేను..!
మహి మహి అంటు, మల్లి మీద మీద పడింది,
వద్దని నేనంటే నా ప్రాణమే నీవంది..
జాబిల్లి దిగివచ్చి,రాజీ చేస్తానంది
ససేమిరా కాదంటే రుసరుస లాడి పోయిందే..
ప్రేమలో, నీ ప్రేమలో పడిపోయానే
నీవే నా లోకమై ,నీవే నా సర్వమని
దాసోహమే అయ్యానే…
కాదనకే కాంచన మాలా
ఔననవే కుందనపు జానా…!
గల్ గల్ మువ్వలు పట్టి పెట్టి,
చెంగు చెంగున
లేడిపిల్లలా ఎగిరెగురుతుంటే
నా దిల్, థ్రిల్ అయ్యిందే,
ప్రేమ హోరులో,నీ ప్రేమ హోరులో
హూషారు జోరులో
ఖుషీ గా మారింది…
గడ్డి పూచగా తీసేస్తావో
గులాబీ పువ్వునే అందుకుంటావో
నా స్వచమైన ప్రేమను
ఇష్టంగా స్వీకరించవే
జన్మంతా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానే…

Related posts