telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ సినిమా వాయిదా ?

Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దరువు శివ (సిరుత్తై శివ) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. అజిత్ హీరోగా వరుసగా నాలుగు సినిమాలు చేసిన శివ వరుస సక్సెస్‌లు సాదించాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరం, వేదలం, వివేగం, విశ్వాసం సినిమాలు ఘన విజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అన్నేటె` అనేది ఈ సినిమా టైటిల్. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ దేశవ్యాప్తంగా అన్ లాక్ 1.0 అమల్లో ఉన్నా.. మరోసారి తమిళ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సినిమాను ముందుగా 2021 సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్నా అది కష్టంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2021 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అదికూడా కుదిరేలా లేదు. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి మహమ్మారీ ఇంకా భీకరంగా విజృంభిస్తుందన్న అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థంకాక సూపర్ స్టార్ అభిమానుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది

Related posts