telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వాహనదారులకు గుడ్‌న్యూస్‌ : తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

petrol bunk hyd

మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా సెంచరీ కొట్టాయి పెట్రోల్‌ ధరలు. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో పెట్రోల్‌ రేట్లు భగ్గుమన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కంటే ఏపీలో పెట్రోల్‌ రేట్లు ఎక్కువగా పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్‌ లీటర్‌ రూ. 91.17కు చేరింది. అయితే.. గత నాలుగు రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా కాస్త తగ్గాయి. పెట్రోల్‌ పై 23 పైసలు, డీజిల్‌పై 25 పైసల చొప్పున తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్‌ ధర రూ. 94.16కు చేరగా.. డీజిల్‌ ధరల రూ. 88.20కు క్షీణించింది. అమరావతిలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 22 పైసలు తగ్గుదలతో రూ. 96.65 కు క్షీణించింది. డీజిల్‌ ధర 24 పైసలు క్షీణతతో రూ. 90.17 కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర 22 పైసలు తగ్గడంతో రూ. 96.91కు పడిపోగా.. డీజిల్‌ ధర 25 పైసలు క్షీణతతో రూ. 90.42కు తగ్గింది. ఇక ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.56కు తగ్గగా.. డీజిల్‌ రూ. 80.87కు తగ్గింది.

Related posts