telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో కొన్ని మినహాయింపులు!

ap

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలుకోసం జనం ఎగబడిపోతుండడం చూసి అనవసర రద్దీని నివారించేందుకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది. సీఎం జగన్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాలను సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్‌ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఎం.కృష్ణ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు, పాలవిక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో తమ నివాసిత ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాల వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వెళ్లాలి. అయితే గుంపులుగా జనం కొనుగోళ్లకు ఎగబడకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ అమలు విషయంలో సమస్యలుంటే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Related posts