telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతి రోజూ సైకిలింగ్ చేస్తే…అన్ని సమస్యలకు చెక్

cycling is best for breast cancer

ప్రతిరోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అసలు సైకిలింగ్‌ వల్ల ప్రయోజనాలు ఎన్ని.. అవేంటో ఇప్పుడు చూద్దాం. సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అడ్రినలిన్‌, ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. సైకిల్‌ తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరిచి మంచి శక్తి కలిగిస్తుంది. రోజూ సైకిల్‌ తొక్కడం ద్వారా బ్రెయిన్‌ పవర్‌ పెరుగుతుంది. అలాగే సైకిల్‌ తొక్కే పిల్లల్లో మెదడు చురుకవుతుంది. సైకిలింగ్‌ చేసేటపుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు. గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్‌ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను రక్షిస్తుంది. సైకిల్‌ తొక్కడం వల్ల వంద శాతం ప్రయోజనాలే తప్ప ఎలాంటి అపకారం ఉండదు. కనీసం రోజుకు 20 నిమిషాలు సైకిల్‌ తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్‌ తొక్కాలంటే మీలోని డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. అదేవిధంగా సైకిల్‌ తొక్కడం వల్ల కాళ్లు, కీళ్ల నొప్పులు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. అన్ని రకాల క్యాన్సర్‌ల నివారణ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని కొవ్వు కరిగి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

Related posts