లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో `ఇండియన్-2` చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.దక్షిణాది ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. గత నెల 19వ తేదీన షూటింగ్ సెట్స్‌లో క్రేన్ కిందపడి ముగ్గురు యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనను క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శంకర్, కమల్‌హాసన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇక, ఘటన జరిగినపుడు స్పాట్‌లో ఉన్న కాజల్‌ను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారట. తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు సమన్లను జారీ చేయనున్నట్లు సమాచారం.
previous post
next post