మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ .ఇందులో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు.మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కుతోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులకు సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘గాడ్‌ఫాదర్’ టీజర్‌ను విడుదల చేశారు.
’20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడన్‌గా తిరగొచ్చిన ఆరేళ్లలో జనాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు’ అన్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇక్కడికీ ఎవరు వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతడు మాత్రం రాకూడదు అంటూ నయనతారను చూపించారు. వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అంటూ సల్మాన్‌కు గైడెన్స్ ఇస్తున్నాడు మెగాస్టార్. చివర్లో సల్మాన్, చిరు ఇద్దరూ కలిసి ఫైట్ సీన్‌లో కనిపించారు. ఈ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తానికి టీజర్‌తోనే ప్రేక్షకుల కడుపు నింపేశాడు డైరెక్టర్. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పనిలో పనిగా ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజవుతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, పూరిజగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.