telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” పని అయిపోయిందంటున్న వర్మ

Dear-Comrade

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన “డియర్ కామ్రేడ్” చిత్రం భారీ అంచనాలతో ఈనెల 26న విడుదలైంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకెళ్తోంది ఈ చిత్రం. మరోవైపు రామ్, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే “డియర్ కామ్రేడ్” విడుదలతో “ఇస్మార్ట్ శంకర్” దూకుడుకు బ్రేక్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ “డియర్ కామ్రేడ్” మొదటి రోజు “ఇస్మార్ట్ శంకర్” కలెక్షన్లపై ప్రభావం చూపినప్పటికీ, రెండవ రోజు నుండి మరింత పుంజుకున్నాయని అంటున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల విషయమై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోగల సినిమా థియేటర్ల కలెక్షన్ రిపోర్ట్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఈ రిపోర్ట్ ని బట్టి చూస్తే “ఇస్మార్ట్ శంకర్” కంటే నాన్ ఇస్మార్ట్ సినిమా అయిన “డియర్ కామ్రేడ్” పెద్దగా కలెక్షన్ రాబట్టడం లేదు, దాని పని అయిపోయిందంటూ పరోక్షంగా కామెంట్ చేశారు. ఆ పట్టికను పరిశీలిస్తే సుదర్శన్ లో ఇస్మార్ట్ శంకర్ రూ.1,08,062 ల కలెక్షన్ సాధిస్తే, సంధ్య థియేటర్ లో ఆడుతున్న డియర్ కామ్రేడ్ రూ.1,04,590 ల కలెక్షన్ ని సంపాదించడం జరిగింది. అయితే వర్మ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేవలం రూ.4000 మాత్రమే కలెక్షన్ తేడా ఉన్నంత మాత్రాన ఇవర్మ ఇలా మాట్లాడడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు.

Related posts