telugu navyamedia
సినిమా వార్తలు

“గుణ 369” వీడియో సాంగ్స్

Guna-369

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ‌ నటిస్తున్న తాజా చిత్రం “గుణ 369”. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అన‌గ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా… ఇందులో ల‌వ్‌, యాక్ష‌న్, ఎమోష‌న్స్ సీన్స్ చూపించారు. ఇవి సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. “మ‌నిషి రూపం వేరు… నిజస్వ‌రూపం వేరు” అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌గా… ఈ కార్య‌క్ర‌మంలో చిత్రానికి సంబంధించి ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేశారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్స్ ను వీక్షించండి.


Related posts