వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే రిలీజ్ చేసి వర్మ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ ట్రైలర్ తో వర్మ అభిమానులలో, ప్రేక్షకులలో ఆసక్తిని అమాంతం పెంచేశారు. తాజాగా ఈ సినిమాలో తొలి వీడియో పాటను రేపు ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు.
ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని వెల్లడించారు. దివంగత ఎన్టీఆర్ సినిమాల్లోని పాటల్లో చాలావరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆలపించారని గుర్తుచేశారు.
నరేశ్ గారు రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దు: నట్టికుమార్