telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్లోబల్ స్టార్ కు హాలీవుడ్ మూవీ ఛాన్స్

Priyanka

గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ముఖ్యంగా గ్రామీ అవార్డు విజేత సెలిన్ డియోన్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అవుట్‌ల్యాండర్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి నటించనున్నట్లు ప్రియాంకా ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని గ్రేస్ ఈజ్ గాన్, పీపుల్ ప్లేసెస్ థింగ్స్ , ది ఇన్ క్రెడిబుల్ జెస్సికా జేమ్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జిమ్ స్ట్రౌజ్ డైర‌క్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘టెక్ట్స్ ఫ‌ర్ యూ’ పేరుతో రానున్న ఈ మూవీలో ప్రియాంకాకు హీరోయిన్‌గా నటించనున్నారు. అద్భుతమైన వ్యక్తులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా, ఇది తనకు గొప్ప గౌరవంగా ఉందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రియాంకాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం.

Related posts