telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపేంద్ర పుట్టినరోజు కానుకగా “కబ్జ” థీమ్ పోస్టర్ విడుదల

Kabja

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా నటిస్తున్న చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గన్స్ తో పాటు, గుట్టలుగుట్టలుగా పడి ఉన్న శవాలు కనిపిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తూ ఆర్.చంద్రు స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. శ్రీధర్ లగడపాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్లో ఇప్పటికే ‘బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏడు భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

Related posts