మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ డ్రగ్స్‌కు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా తమ కార్యకలాపాతను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహిస్తోందని పోలీసులు వెల్లడించారు.
జయలలిత బయోపిక్ కు బ్రేక్ వేస్తానంటున్న దీప