బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇటీవల సల్మాన్ ట్విటర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. తన అభిమానులందరూ సుశాంత్ ఫ్యాన్స్‌కు అండగా నిలవాలని సల్మాన్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై గాయని సోనా మహాపాత్ర మరోసారి విమర్శలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో “విషపూరిత స్వభావం కలిగిన, పెద్ద హృదయం కలిగిన ఓ వ్యక్తి నుంచి ఓ పెద్ద కదలిక (పీఆర్ మూవ్). అతని డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో ఇతరులను ఇలా బెదిరించినపుడు ఇలాంటి ఓ ట్వీట్ లేదా క్షమాపణ అవసరమని అతను భావించలేదు` అని సోనా ట్వీట్ చేసింది. గతంలో కూడా చాలా సార్లు సల్మాన్‌పై సోనా తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు మరోసారి ఇలా వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
previous post
next post