telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ సినిమాపై వచ్చినవన్నీ రూమర్లే…!

Balakrishna

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీని తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోని సినిమాను మొదలుపెడతారు. ఈ సినిమా గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ భామ రచితా రామ్‌ని తీసుకున్నారని, సంజయ్‌దత్ విలన్‌గా నటించబోతున్నాడని, అనిరుథ్ సంగీతం అందించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం రచితను సంప్రదించనే లేదట. హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోందట. అలాగే విలన్ పాత్ర కోసం సంజయ్‌దత్‌ను అడగనేలేదని సమాచారం. అలాగే సంగీత దర్శకుడి గురించి కూడా చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. వచ్చే నెలలో కాస్టింగ్‌ను ఫైనలైజ్ చేసి జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts