telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్‌బాస్‌పై గీతామాధురి కామెంట్స్ …

Geetha-Madhuri

2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన బిగ్‌బాస్ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. మరోవైపు ఈ బిగ్‌బాస్‌పై కంటిస్టెంట్ల వివాదాస్పద కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్‌లో పాల్గొని బయటకొచ్చిన ఎందరో కంటిస్టెంట్లు ఈ షోపై పలు రకాలుగా నెగెటివ్ కామెంట్స్ చేసారు. ఈ క్రమంలోనే తాజాగా గీతామాధురి రియాక్ట్ అవుతూ ఓ సెటైర్ వేస్తూ చర్చకు తెరలేపింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బిగ్ బాస్ మూడో సీజన్ కంటిస్టెంట్ తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ బిగ్‌బాస్ వల్ల తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పి చర్చలకు తెరలేపింది. అంతటితో ఆగక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తమ అనుభవాలను వెల్లడించాలని కోరింది. దీంతో తాజాగా బిగ్‌బాస్‌పై తనదైన స్టైల్‌లో స్పందిస్తూ ఆ ప్రోగ్రాంపై సెటైరికల్ కామెంట్ చేసింది సింగర్ గీతామాధురి. బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న ఆమె తన `బిగ్‌బాస్` అనుభవాన్ని షేర్ చేస్తూ సింగిల్ లైన్‌ రియాక్షన్ ఇచ్చింది. ఆ సీజన్ రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి.. హౌస్ నుంచి బయటకొచ్చిన పిక్ షేర్ చేస్తూ ”2 సంవత్సరాల క్రితం ఫొటో ఇది. బరువుతగ్గి సన్నగా కావాలనుకునే వారికి నా సలహా ఒక్కటే.. బిగ్‌బాస్‌కు వెళ్ళండి” అని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్ నెటిజెన్స్ రక రకాలుగా చర్చించుకుంటున్నారు.

Related posts