telugu navyamedia
సినిమా వార్తలు

అమిత్‌ షాతో బాద్‌షా మీట్ .. అసలు రహస్యం ఇదేనా?

*అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ
*సినిమా, రాజకీయ అంశాలపై చర్చ?
*వీరి సమావేశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Image

మునుగోడులో బహిరంగసభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు.

Image

ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.

అయితే మినిష్టర్ అమిత్ షాను ఎన్టీఆర్ కలవడం.. డిన్నర్ కు ఆహ్వానించడం..దేశ వ్యాప్తంగా పెద్ద‌ చ‌ర్చ‌కు దారి తీస్తుంది. అసలు ఎందుకు వీరు కలిసుంటారా అన్న ఆలోచన అటు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో అంతుపట్టలేకుంది.

Image

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ చూసిన అమిత్ షా..కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటనకు ముగ్థులయ్యారని.. అందుకే అభినందించడానికి పిలిచి ఉంటారని కొందరంటుంటే.. తారక్ ను బిజేపీలోకి ఆహ్వానించడానికే అని మరికొందరంటున్నారు.

ఈ క్రమంలో అమిత్‌షా ఈ భేటీపై ట్వీట్‌ చేశారు…అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది.. అంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు.

Image

ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ట్వీట్ ను చేశారు… మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అమిత్ షా జీ. మీరు నాగురించి మాట్లాడిన మాటలకు ధన్యవాదాలు అంటూ తారక్ రిప్లై ఇచ్చారు. అమిత్ షా ట్వీట్ ను కూడా ఆయన షేర్‌ చేశారు.

Related posts