టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా సినీ పరిశ్రమపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. 10 కోట్లు లోపు నిర్మించే సినిమాలకు GST రేయంబర్స్ మెంట్ ప్రకటించారు సీఎం కెసిఆర్. థియేటర్ వారి ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. 6 నెలలు థియేటర్లు లో కరెంట్ బిల్లు రద్దు చేస్తామని సీఎం కెసిఆర్ తెలిపారు. ఇది ఇలా ఉండగా.. సినిమా ధియేటర్లు మల్టీప్లెక్స్ లో ఓపెనింగ్ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50శాతం సిటింగ్ తో తెలంగాణలో సినిమా థియేటర్లు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మాస్కులు శానిటైజర్ తప్పని సరిగా వాడాలని సూచనలు చేసింది ప్రభుత్వం. టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని ఏసీ థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
previous post
next post