telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ “బంగార్రాజు”లో సమంత ?

Samantha

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో బంగార్రాజు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో “బంగార్రాజు” అనే టైటిల్ తో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కూడా ఓ పాత్రలో నటిస్తుండగా… సమంత కూడా సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్రలో నటించబోతోందని ఇప్పటికే ఆమెకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక అన్ని కలిసి వస్తే నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఒకవేళ అది కుదరకపోతే వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది.

Related posts