telugu navyamedia
సినిమా వార్తలు

మైక్ టైసన్ తో లైగర్ టీమ్ ఎంజాయ్‌..

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను పూరి జగన్నాథ్ మరియు ఛార్మి లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Image

‘లైగర్’ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్​ టైనస్​ నటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. ఆయనపై కీలక సన్నివేశాల్ని తీస్తున్నారు.

Image

ఇందులో భాగంగా టైసన్​తో తీసుకున్న ఫొటోల్ని నిర్మాత ఛార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంద‌ని స‌మాచారం.

Image

Related posts