యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూపిస్తూ ప్రభాస్ అభిమానులు కొందరు కొన్ని డిజైన్స్ రూపొందించారు. చేతితో వేసిన చిత్రాలు, పెయింటింగ్స్, డిజిటల్ ఆర్ట్, ఫొటోషాప్ స్టిల్స్ తో కలిపి ఓ వీడియోని చేశారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే ఈ వీడియోని చిత్ర దర్శకుడు ఓం రావత్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలయిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు ఆది పురుష్ లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలువిద్య నేర్చుకోనున్నాడు.
Here are some of the amazing fanarts of #Adipurush!#Prabhas @itsBhushanKumar pic.twitter.com/u5mdsFv8i8
— Om Raut (@omraut) August 28, 2020