telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదరగొడుతున్న “టక్ జగదీష్” రొమాంటిక్ సాంగ్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో నాచురల్ స్టార్ నాని కూడా ఒక్కడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం నాచురల్ స్టార్ తన తాజా చిత్రం టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వానా దర్శకత్వంలో సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇతర సినిమాల వారు వరుసగా లిరికల్ పాటలు విడుదల చేస్తున్నారు. తాజాగా టక్ జగదీష్ సినిమా నుంచి సరికొత్త పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా యదలో చేరి అంటూ సాగే ఈ పాట కుర్రకారుని కట్టిపడేస్తుంది. ఈపాట దాదాపు రెండు మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఫ్యామిలీ, రొమాన్స్ జానర్స్‌లో తెరకెక్కుతోంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీన్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి వారి అంచనాలను నాచురల్ స్టార్ అందుకుంటారేమో వేచి చూడాలి.

Related posts