తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు నమస్కారాలు తెలుపుతూ సభకు హాజరయ్యారు.
మంత్రి కేటీఆర్.. తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారం అంటూ చేతులు జోడించి ముందుకెళ్లారు. అంతకుక్రితం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రుల్లో కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కేసీఆర్ పై జనసేనాని ఘాటు విమర్శలు..పవన్ పై చంద్రబాబు ప్రశంసలు