రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2000 రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఏడో విడత నగదు జమ కాగా.. ఎనిమిదో విడత నగదు మార్చి నెలలో జమ కానుంది. యాసంగి సీజన్ సమయంలో డబ్బులు రిలీజ్ చేస్తే… రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తోందట. కాగా.. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీంను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రూ. 6000 మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది కేంద్రం. తాజాగా ఎనిమిదో విడత నగదును రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది.
next post
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్షా