telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని ” టక్‌ జగదీశ్‌” టీజర్‌ వచ్చేసింది…

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వచ్చే రెండు సంవత్సరాలకు సరిపడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అందులో నాచురల్ స్టార్ నాని ఒక్కడు. ప్రస్తుతం నాని ”టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్” సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.అయితే నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు అలాగే ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ అనే లిరికల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. అయితే వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే…అయితే.. తాజాగా టక్ జగదీష్ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ పూర్తిగా మాటలతో కాకుండా థమన్‌ సంగీతం.. థీమ్‌ పాటతో సాగింది. నాని, రీతు లవ్‌ ట్రాక్‌తో పాటుగా.. ఫైటింగ్‌ సీన్స్‌ కూడా ఈ టీజర్‌లో చూపించారు. కాగా.. నాని కనిపించిన ప్రతి సీన్‌లోనూ టక్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఈ టీజర్‌ మూవీ అంచనాలను సైతం అమాంతం పెంచేసింది. ఇక ఈ టీజర్‌పై నాని ట్వీట్‌ చేస్తూ.. “పండగకి వచ్చే సినిమాలు కొన్ని పండగలాంటి సినిమాలు కొన్ని” అంటూ తనదైన స్టైల్‌లో ట్వీట్‌ చేశాడు.

Related posts