telugu navyamedia
క్రీడలు వార్తలు

45 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడుతా : గేల్

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో జరిగిన మ్యాచులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో గేల్ విఫలమయ్యాడు. 9 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బుధవారం చెన్నై వేదికగా హైదరాబాద్‌తో పంజాబ్ తలపడనుంది. క్రిస్ గేల్ తాజాగా మాట్లాడుతూ… తన రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. ‘వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఇక నేను నిరూపించుకోవడానికి ఏమీ మిగలలేదు. అన్ని సాధించాను. ప్రతి సంవత్సరం మెరుగవ్వాలని అందరూ కోరుకుంటారు. నేను దాన్ని అమలు చేయగలిగితే.. నాకు ప్లస్ అవుతుంది. ఇక ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టును మొదటగా ప్లేఆఫ్‌లోకి తీసుకెళ్లాలి. ఆపై ఫైనల్‌కు చేరుకుని ట్రోఫీ సాదించాలి. ఇది కష్టమయినా లక్ష్యం చేరుకుంటాం’ అని గేల్ తెలిపాడు. నేను ఇంకా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాను. 45 సంవత్సరాల వరకు ఆడడమే నా లక్ష్యం. నాకు ఇప్పుడు 41, ఈ సంవత్సరంతో 42 ఏళ్లు పూర్తవుతాయి. నా రిటైర్మెంట్‌కు ఇంకా చాలా సమయం ఉంది’ అని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అన్నాడు.

Related posts