కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఈ విషయమై పై దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆలోచించాలని, కేంద్ర వైఖరిని ఖండించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత కేసులకు భయపడి నోరు మెదపడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడటం లేదని ఆరోపించారు.
దక్షిణాదికి చెందికి చెందిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఐటీకి సంబంధించి పేద, మధ్య తరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలు లేవని అభిప్రాయపడ్డారు.