telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

Adimulapu sures

పదో తరగతి, ఇంటర్ పరీక్షల పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటరు పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ఉండవచ్చని… అలాగే జూలై నెలాఖరులో పదో తరగతి పరీక్షలను పెట్టేందుకు పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ పరీక్షలపై గురువారం సీఎం జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ క్యారెట్ ఇచ్చారు. DSC 2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్ లో ఉందని.. 2వేల మంది అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పధంతో నిర్ణయం తీసుకున్నారన్నారు. టీడీపీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి మోసపుచ్చారని ఫైర్ అయ్యారు. వారి బాధను పాదయాత్రలో జగన్ కి వివరించారని..ఇప్పుడు వారిని SGTలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత మర్చిపోయిన ఘనత గత ప్రభుత్వానిదని మండిపడ్డారు.

Related posts