telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ చిన్న కీటకం భారీ సంఖ్యలో రైళ్ళను ఆపేసింది…!!

Train

నత్తగుల్లను పోలి ఉన్న ఓ చిన్న కీటకం(స్లగ్) భారీ సంఖ్యలో ట్రైన్లు నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన మే 30న జపాన్‌లో జరిగింది. ఈ కీటకం కారణంగా దక్షిణ జపాన్ పరిధిలోని క్యుషు రైల్వే కంపెనీ అధికారులు ఏకంగా 26 రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడవనున్నట్లు ప్రకటించారు. ఓ నత్త లాంటి చిన్న కీటకం 12వేల మంది ఆలస్యానికి కారణమైంది. అసలా కీటకం ఏం చేసిందంటే… విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేసింది. ఆ కీటకం రైల్వే ట్రాక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఓ విద్యుత్ పరికరంలో చోరబడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ముందుగా అధికారులకు ఉన్నట్టుండి ఇలా విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయిందో అర్థం కాలేదట. కొన్ని వారాల తరువాత క్యుషు రైల్వే అధికారులు కరెంట్ పోయిన రైల్వే లైన్లను జాగ్రత్తగా పరిశీలించడంతో ఓ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఒక విద్యుత్ పరికరంలో చోరబడిన కీటకం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయి ఉండడం గమనించారు. దాంతో ఆ కీటకం వల్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు నిర్ధారించారు. రైల్వే అధికారులు ఇలా చిన్న కీటకం వల్ల ట్రైన్లు ఆగిపోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో జేఆర్ క్యుషు రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని రైల్వే ట్రాక్స్ పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలన్నింటినీ పరిశీలించారు. వాటిలో ఎలాంటి కీటకాలు లేవని నిర్ధారించారు. ఈ సంఘటన పెద్ద చర్చకు దారి తీయడం గమనార్హం.

Related posts