telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆట కదరా శివ… ముక్కంటి చెంత కరోనా కల్లోలం… !!

Srikalahasthi

గ్రహణం అంటే చాలు ఎంత ప్రసిద్ధిచెందిన ఆలయమైనా మూసేస్తారు. కానీ గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ఆలయం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయ తలుపులు ఎప్పుడూ మూసేసింది లేదు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆలయాన్ని కూడా కరోనా మూసేసింది. శ్రీకాళహస్తిలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తోంది. మార్చి 24న ఇక్కడ మొదట లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వచ్చింది. చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి కేసు కూడా ఇదే. అప్పట్నుంచి ఈ నెల మూడో వారానికి పట్టణంలో 150 మందికి పైగా కరోనా సోకింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో ప్రాచుర్యం ఉన్న ఆలయం కావడంతో రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేవారు. లాక్ డౌన్ కారణంగా 75 రోజుల పాటు ఆలయాన్ని మూసేసారు. జూన్ 10వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేయగా..ఆలయ పూజారికి కరోనా సోకడంతో దర్శనాలను వాయిదా వేశారు. మరో 10 రోజుల తర్వాత దర్శనాల కోసం అన్ని ఏరాట్లు చేయగా ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడితో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. దర్శనాలు ఎన్నడూ ఆగని ముక్కంటి చెంత కరోనా వింతటా చూసి భక్తులు నివ్వెరపోతున్నారు. శ్రీకాళహస్తిలో చరిత్రలో ఇంతటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.

Related posts