telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వాట్‌ ఈజ్‌ ద మీనింగ్‌ ఆఫ్‌ దట్”‌… కరీనా కపూర్ వీడియో వైరల్

Kareena

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన “దబాంగ్-2” చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలై 8 ఏండ్లు అవుతోంది. ఈ చిత్రంలో అందాల తార కరీనాకపూర్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పెవికాల్‌ సే” అంటూ సాగే మాస్‌ సాంగ్‌లో కరీనా, సల్మాన్‌ కలిసి వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. అయితే ఈ పాట షూటింగ్‌ కొనసాగుతున్నపుడు లొకేషన్‌లో కరీనా లిరిక్స్‌ను అన్వయించింది. ఆ తర్వాత పాటలో వచ్చే “పాట్రోల్‌ సే” పదానికి అర్థమేంటనీ అక్కడున్న వారిని అడుగుతోంది. లొకేషన్‌లో తీసిన అప్పటి వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన ఓరచూపులతో అందరినీ మెస్మరైజ్‌ చేస్తూ… కరీనా “వాట్‌ ఈజ్‌ ద మీనింగ్‌ ఆఫ్‌ దట్”‌ అంటూ అడుగుతున్న చిన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts