telugu navyamedia
సినిమా వార్తలు

అల్లంత దూరంగా.. నువ్వు ..నీ కన్నునన్నే చూస్తుంటే ..

హీరో సుధీర్‌ బాబు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబుకి జోడీగా ‘ఉప్పెన’ తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన‌ మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ఆక‌ట్టుకుంది.. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్‌ చేశారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..  అంటున్న‌ సుధీర్ బాబు.. బేబ‌మ్మ‌తో రొమాన్స్‌

అల్లంత దూరాన నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చేయాలో అంటూ మొదలయ్యే ఈ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే అంటూ హీరోహీరోయిన్‌ మధ్య ప్రేమ పుట్టే సమయంలో ఉండే భావాన్ని పాటగా మలిచారు.

దీంతో ఈ పాట యూత్‌ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చైత్ర, అభయ్ ఆలపించారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజ‌ర్ రిలీజ్‌.. మ‌ళ్లీ అదే కాన్సెప్ట్‌తో..

కాగా ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కల్యాణి నటరాజన్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర‌యూనిట్‌ తెలిపారు.

Related posts