telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు…. “వి” ట్రైలర్… !

v

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంల తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వి’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు సమర్పణలో రూపొందింది ఈ చిత్రం. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. నాని కెరీర్‌లో 25వ సినిమాగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో నాని మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా “వి” ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం 45 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగ్స్ కూడా సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. “ఏ పని చేసినా సరే ఎంటర్‌టైనింగ్‌గా చేయాలనేది నా పాలసీ” అంటూ నాని సీన్‌తో స్టార్ట్ చేసిన సన్నివేశాలను.. “మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు” అంటూ నాని చెప్పిన డైలాగుతోనే ట్రైలర్ ను ముగించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే V ప్రేక్షకులకు యాక్షన్‌తో సరికొత్త ఫన్ అందించబోతోందని తెలుస్తోంది.

Related posts