telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కె.జి.య‌ఫ్-2” షూటింగ్‌లో ప్రకాష్ రాజ్

KGF

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం, భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇందులో అధీర పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన `కె.జి.య‌ఫ్` సంచ‌ల‌న విజ‌యం సాధించ‌గా ఇప్పుడు రెండో భాగం మ‌రింత సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 1ను పాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాప్ట‌ర్ 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 26 నుంచి బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోలో కెజిఎఫ్‌2 షూటింగ్ మొదలయ్యింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. బ్యాక్ టు వర్క్’.. అంటూ సెట్‌లో తీసిన పిక్స్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పదిరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో కేవలం క్లైమాక్స్ ఫైట్ మినహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తయినట్లే.

Related posts