సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్ అయ్యారు. కడలూరు జిల్లాలో జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు కుష్బూ ప్రయత్నించిన సందర్భంలో ఆమెను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేంకంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన బిజెపి…. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరంలో బిజెపి ఆందోళనలు చేపట్టింది. అయితే..ఈ ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూని ఈసీఆర్ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేసారు. కాగా, తాజాగా ఖుష్బూ ఇటీవల బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. … దేశంలో 120 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోడీకి, బీజేపీ కి మద్దతుగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం ఉన్నట్లు గా కాంగ్రెస్ ఇప్పుడు లేదు. రాష్ట్ర నాయకులు చెప్పిందే రాహుల్ గాంధీ వింటున్నారు. ”ఖుష్బూ కేవలం నటి మాత్రమే” అంటూ తమిళనాడు పిసిసి అధ్యక్షుడు అళగిరి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అందం, తెలివితేటలు ఉన్న మహిళను కాబట్టే ఓర్చుకోలేకపోయారు. నా పట్ల అసూయ, ద్వేషం వెళ్లగక్కారు అని అన్నారు.