telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కవిత కోసం .. కేసీఆర్ స్కెచ్ .. క్యాబినెట్ లో మూడో మహిళ గా..

cm kcr met with harishrao today

తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత పేరు లేకుండా కేసీఆర్ లేడు అనేది నమ్మడానికి కాస్త కష్టమే. కుటుంబం అంతా పదవులలో ఉన్నరోజులే ఎక్కువ. కానీ గత ఎన్నికలలో కవిత పై రైతుల పోరుతో ఆమెకు ఓటమి తప్పలేదు. దీనితో ఆమె ఖాళీగా ఉండాల్సివచ్చింది. తాజా కేసీఆర్ క్యాబినెట్ లో హరీష్ కి కూడా స్థానం లభించడంతో కవిత మాత్రమే కేసీఆర్ రాజకీయ కుటుంబం లో స్థానం దక్కని వ్యక్తిగా మిగిలిపోయింది. మొదటి నుండి కుటుంబం అంతా పదవులలో ఉండటం, కానీ ప్రస్తుతం కవిత మాత్రమే పదవి లేకుండా ఉండటం ఆమెకు తలకొట్టేసినట్టే ఉంది. దీనితో ఆమెకు ఎలాగైనా పదవి కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యూహరచన చేసేశాడు. త్వరలో జరగనున్న ఉపఎన్నికలో కవితకు సిటు ఇవ్వడం, ఆమెను గెలిపించడం, క్యాబినెట్ లో స్థానం కల్పించడమే ఆయన ప్రస్తుత ప్రణాళిక. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నుంచి గెలిచిన ఉత్తమ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది.

కేసీఆర్ తన కేబినెట్‌లోకి ముగ్గురు మహిళలను తీసుకోవాలని అనుకుని కూడా ఇద్దరిని మాత్రమే నియమించారు. కానీ గెలుపు కోసం కాస్త కష్టపడితేనే ఫలితం అని నిపుణులు కేసీఆర్ కి సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికోసం హుజూర్ నగర్ లో కార్యాచరణ ప్రారంభం అయినట్టే, ఇక కవిత కు ఎవరినీ పట్టించుకునే స్వభావం లేదని, రైతుల సమస్యలను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత గెలుపు అంత ఈజీకాదని చెబుతున్నారు. మరోపక్క, ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డి.. తనకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. కవితకు లక్కుచిక్కుతుందో లేదో చూడాలి.

Related posts