ఈ ఫొటోలోని బొద్దు గుమ్మ ఎవరో గుర్తు పట్టారా ? ఈమె ఇప్పుడు కన్నడంలో టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ “జెర్సీ” ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్. మీరు చూస్తుంది నిజమే… హీరోయిన్ కాకముందు శ్రద్ధ బొద్దుగానే ఉండేదట. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని పాత ఫోటోను షేర్ చేసిన శ్రద్ధ.. అందంగా కనిపించడం కోసం ఎంతగా కష్టాలు పడిందో వివరించింది. “బాలి. అక్టోబర్ 2104. విహారయాత్ర కోసం తొలిసారి విదేశానికి వెళ్లినపుడు తీసుకున్న ఫోటో. న్యాయవాద వృత్తిని కెరీర్‌గా ఎంచుకుని సంవత్సరంపాటు పనిచేశాను. బాగా డబ్బు రావడంతో విపరీతంగా ఖర్చుపెట్టేదాన్ని. ఫుడ్, బట్టలు, సినిమాలు, విహారయాత్రలకోసం ఆలోచించకుండా ఖర్చుపెట్టేదాన్ని. నచ్చింది తినేసేదాన్ని. నెలకోసారి మాత్రమే వ్యాయామం చేసేదాన్ని. దాంతో విపరీతంగా బరువు పెరిగాను. అందం విషయంలో ఎవరికంటే నేను తక్కువకాదు అనుకునేదాన్ని. చాలా బద్దకంగా ఉండేదాన్ని. అప్పుడు తీసుకున్న ఈ ఫోటోను చూసిన తర్వాత చిన్న వయసులో అంత ఎక్కువ బరువు ఉండకూడదని గ్రహించాను. మా అపార్ట్మెంట్లో ఉండే జిమ్‌కు వెళ్లడం ప్రారంభించా. మొదట్లో 5 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు.. ఆ తర్వాత గ్యాప్ లేకుండా 40 నిమిషాలు పరిగెట్టేదాన్ని. అలా ఐదేళ్లు విపరీతంగా శ్రమించి 18 కిలోల బరువు తగ్గాను. కఠినతరమైన వ్యాయామం చేశాను. నేనింతలా శ్రమించడానికి ఒకటే కారణం.. నేను అందంగా కనిపించాలని అనుకోవడమే. అందంగా ఉండడానికి ఎలాంటి హద్దులూ ఉండవు. సామాజిక మాధ్యమాల కోసం కాకుండా మీ ఆరోగ్యం కోసం ఎంతవరకు సాధ్యమో అంతవరకు కసరత్తులు చేయండి. అందంగా, ఆరోగ్యకరంగా జీవించండ`ని శ్రద్ధ పేర్కొంది.
previous post