telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వచ్చే ఏడాది మనం పిల్లల్ని కందాం… పాప్ స్టార్ పోస్ట్ వైరల్

Justin

పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇండియాలోనూ బీబర్ ఫ్యాన్స్ కోకొల్లలు. చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. గతేడాది జస్టిన్ తన ప్రేయసి హెయిలీ బాల్డ్‌విన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2018 సెప్టెంబర్‌లో బీబర్, హెయిలీ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నిన్ననే హెయిలీ తన 23వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా బీబర్ తన ప్రియమైన భార్య కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. “బేబీ హ్యాపీ బర్త్‌డే. రోజూ నన్ను నేను మెరుగుపరుచుకునేలా చేస్తున్నావ్. నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్న తీరు నన్ను చాలా ఆకట్టుకుంటోంది. నువ్వు ఎలా ఉన్నా కూడా నన్ను నీ అందంతో టెంప్ట్ చేస్తుంటావ్. వచ్చే ఏడాది మనం పిల్లల్ని కందాం” అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కి కొద్దిసేపట్లోనే నలభై లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Related posts