telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో అలియా భట్ పారితోషికం ఇదే…?

Alia-Bhatt
రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే టైటిల్ తో భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, రామ్ చరణ్ కు జోడిగా సీత ఏ పాత్రలో అలియా భట్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కు జోడిగా డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీంతో అలియా భట్ ఈ సినిమా కోసం భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అలియా భట్ తాను నటించిన “రాజీ” భారీ హిట్ ను అందుకోవడంతో తన పారితోషికాన్ని పెంచేసింది. ఇప్పుడు 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్న ఈ బ్యూటీ “ఆర్ఆర్ఆర్” కోసం 15 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. అందుకే అలియా భట్ భారీగా డిమాండ్ చేసిందట. బేరసారాల తరువాత అలియా భట్ కు 12 నుంచి 15 కోట్ల పారితోషికం అందుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related posts