telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంటి పనులు నేనే చేసుకుంటా… : శృతి హాసన్

Shruthi-haasan

మల్టీటాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటానని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెలబ్రిటీలు ఇంటి పనులు కూడా చేస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపోతుంటారని, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి అన్ని ఇంటి పనులూ తానే చేసుకుంటానని, లాక్‌డౌన్‌లో వంటపాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా? అని కొందరు చాలెంజ్‌ చేశారని చెప్పింది. అయినా ఇటువంటి పనులు చేయడం ఒక ఛాలెంజా? ఆ పనులు అందరూ చేయాల్సినవేనని ఆమె చెప్పింది. తాను చెన్నై ఎప్పుడు వచ్చినా తన తండ్రి కమల‌హాసన్‌ను కలుస్తానని తెలిపింది. ఇక తాను ఇంట్లో ఒంటరిగానే ఉంటానని, ఒంటరితం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో ఒంటరిగా గడిపినప్పటికీ తనకు బోర్ ‌కొట్టలేదని తెలిపింది. ఇక శృతి హాసన్ నటి మాత్రమే కాదు.. గాయని, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసి అందులో తన సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తోంది. కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పని చేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

Related posts