telugu navyamedia
సినిమా వార్తలు

“పుష్ప” లో దాక్షాయణిగా అనసూయ లుక్‌ రిలీజ్‌..

డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​, రష్మిక మంద‌న జంటగా నటిస్తున్న ‘పుష్ప. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు.ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేయగా, అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది.

Image

తాజాగా ఈ చిత్రంలో అనసూయ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. దక్షాయనిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఈ పోస్టర్​ సినిమాపై మరింత ఆసక్తిని రేపుతోంది. ఇందులో ఆమె.. నోట్లో ఆకు నములుతూ, చేతిలో కత్తెర పట్టుకొని దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె హెయిర్​ స్టైల్​ ప్రత్యేకంగా నిలిచింది. ఈ లుక్​ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ..తాజాగా పుష్ప సినిమాలో ‘దాక్షాయని’ అనే కీలక పాత్రలో నటిస్తుంది..ఇందులో దాక్షాయణిని అహంకారం నిండిన మహిళ పాత్రను పోషిస్తోంది. వ‌రుస బ్లాక్‌బ‌స్టర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

Related posts