telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అన్నీ ఆధారాలతో రెండు రోజులో మీ ముందుకు వస్తాను : నరసింహా

యాంకర్ శ్యామల భర్త సింధూర రెడ్డి అనే మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన నరసింహ రెడ్డి ఈ విషయంపై స్పందించిన వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరసింహ రెడ్డి మాట్లాడుతూ “గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో నాపై వస్తున్న కథలు, కథనాల గురించి విషయం షేర్ చేసుకోవడానికి అన్నీ ఆధారాలతో, వివరాలతో మరో రెండ్రోజుల్లో మీ ముందుకు వస్తాను. నాకు న్యాయం, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నేను రెండోజుల్లోనే బయటకు వచ్చానంటే అది తప్పుడు కేసు అని తెలుస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి నిందలు భరించాల్సి వస్తుంది. వాటిని నిరూపించుకోవాల్సింది కూడా మన మీదే ఉంటుంది అని అన్నాడు.

Related posts