telugu navyamedia
సినిమా వార్తలు

జగమెరిగిన సత్యం మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్‌..

వినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా జగమెరిగిన సత్యం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెర‌కెక్కించిన ఈ సినిమాను తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు.

అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 జగమెరిగిన సత్యం చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.

ఈ సినిమా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేలో సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. మోషన్ పోస్టర్ గ్రాండ్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.

Related posts