మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు. ఈసినిమాను జాఫ్రీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు సోదరి పాత్రలో నటించనున్నారు. ఇద్దరు కలిసి స్కామ్ చేయనున్నారంట. అయితే తెలుగులో మోసగాళ్లు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇతర భాషల్లో మాత్రం ‘అను అండ్ అర్జున్’ అనే టైటిల్ తో విడుదల అవుతుంది. తాజాగా ఈరోజే ఈ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్లను విడుదల చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో ఇతర నటుల విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా నవదీప్, సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళీ, నవీన్ చంద్ర తదితరులు నటిస్తుండటంతో ‘మోసగాళ్లు’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా విష్ణు కి హిట్ ను అందిస్తుందా… లేదా అనేది.
previous post